Saturday, March 21, 2026
E-PAPER
Homeఖమ్మంఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్ కు మాతృ వియోగం 

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్ కు మాతృ వియోగం 

- Advertisement -

– కార్డియాక్ అరెస్ట్ తో వరలక్ష్మి మృతి 
– హైదరాబాద్ నుండి అశ్వారావుపేట భౌతిక కాయం తరలింపు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అశ్వారావుపేట అధ్యక్షుడు సంకా ప్రసాద్ కు మాతృ వియోగం అయింది. మోకాలి శస్త్రచికిత్స కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సంకా వరలక్ష్మి (75) చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మికి భర్త, ముగ్గురు సంతానం ఉన్నారు. కూతురు గత మూడేళ్ళ క్రితం మృతి చెందారు.ఒక కుమారుడు ఆస్ట్రేలియా లో స్థిరపడ్డారు.ప్రస్తుతం సంకా ప్రసాద్ వద్దే తల్లిదండ్రులు జీవనం గడుపుతున్నారు.

వరలక్ష్మీ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి అశ్వారావుపేట కు తరలిస్తున్నారు.ఆస్ట్రేలియా నుండి చిన్న కుమారుడు రాగానే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు,సహచర వ్యాపారులు ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు.ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -