స్వప్న సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘ఛాంపియన్’. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. రామ్ చరణ్ మాట్లాడుతూ,’ ఎన్టీఆర్‌కి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ వన్’, అల్లు అర్జున్‌కి ‘గంగోత్రి’, మహేష్‌కి ‘రాజకుమారుడు’, నాకు చిరుత.. మా అందరికీ మోస్ట్ కామన్ బ్యూటీఫుల్ పర్సన్ మా దత్తుకి, వైజయంతి మూవీస్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము ఎలా పెర్ఫాం చేస్తామో తెలియకుండానే మా అందరికీ మొదటి సినిమా ఇచ్చి ఇంత అద్భుతమైన ప్రయాణాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు.
రోషన్ కూడా ‘ఛాంపియన్’తో వస్తున్నాడు. రోషన్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఇందులో తన పోస్టర్ చూస్తుంటే ఒక హాలీవుడ్ యూరోపియన్ యాక్షన్ హీరోలాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. నా రెండో సినిమా ‘మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘రోషన్‌ని బ్లెస్ చేయడానికి వచ్చిన రామ్ చరణ్‌కి థ్యాంక్యూ. ఈ సినిమా కోసం మీ అందరి లాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ప్రదీప్ అద్భుతమైన దర్శకుడు. తను భవిష్యత్తులో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. మా దత్తుతో ‘పెళ్లి సందడి’ చేశా. ఇప్పుడు రోషన్‌తో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని శ్రీకాంత్ చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ , హీరో రోషన్, డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, ప్రొడ్యూసర్ అశ్విని దత్, అనస్వర రాజన్ తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
‘ఛాంపియన్’ హిట్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



