Monday, February 23, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ పెగులా

చాంపియన్‌ పెగులా

- Advertisement -

దుబాయ్ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌

దుబాయ్ : అమెరికా భామ, నాల్గో సీడ్‌ జెస్సికా పెగులా కెరీర్‌ పదో డబ్ల్యూటీఏ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ ఏడాది బ్రిస్బేన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరిన పెగులా.. దుబాయ్ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో (డబ్ల్యూటీఏ 1000) ఏకంగా టైటిల్‌ ఎగరేసుకుపోయింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఏడో సీడ్‌, ఉక్రెయిన్‌ అమ్మాయి ఎలినా స్విటోలినాపై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా గెలుపొందింది. 3 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో స్విటోలినాను ఉక్కిరిబిక్కిరి చేసిన పెగులా.. పాయింట్ల పరంగా 67-47తో పైచేయి సాధించింది. తొలి సెట్లో డబుల్‌ ఫాల్ట్స్‌తో వెనుకంజ వేసిన స్విటోలినా.. రెండో సెట్లో పెగులాకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -