Monday, June 2, 2025
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ రూడ్‌

చాంపియన్‌ రూడ్‌

- Advertisement -

జాక్‌ డ్రేపర్‌పై మెరుపు విజయం
మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ 2025

మాడ్రిడ్‌ (స్పెయిన్‌) : 26 ఏండ్ల నార్వే స్టార్‌ కాస్పర్‌ రూడ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. వరల్డ్‌ నం.7 కాస్పర్‌ రూడ్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో గ్రేట్‌ బ్రిటన్‌ ఆటగాడు జాక్‌ డ్రేపర్‌పై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. 7-5, 3-6, 6-4తో డ్రేపర్‌ను చిత్తు చేసిన కాస్పర్‌ రూడ్‌ కెరీర్‌ తొలి ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిల్‌ను గెల్చుకున్న తొలి నార్వే ఆటగాడిగా సైతం కాస్పర్‌ రూడ్‌ రికార్డు సృష్టించాడు. మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంక టైటిల్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
టైటిల్‌ పోరులో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన 14వ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ ఐదో సీడ్‌ జాక్‌ డ్రేపర్‌పై మెరుపు విజయం సాధించాడు. తొలి సెట్‌ ఉత్కంఠభరితంగా సాగినా 7-5తో పైచేయి సాధించిన కాస్పర్‌ రూడ్‌.. రెండో సెట్‌ను 3-6తో కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌ నువ్వా నేనా అన్నట్టు సాగినా.. కాస్పర్‌ రూడ్‌ అంతిమంగా పైచేయి సాధించాడు. 6-4తో జాక్‌ డ్రేపర్‌పై ఆధిపత్యం చూపించాడు. తొమ్మిది ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన కాస్పర్‌ రూడ్‌..పాయింట్ల పరంగా 99-99తో సమవుజ్జీగా నిలిచాడు. ఆరు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జాక్‌ డ్రేపర్‌ ఆఖరు వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. ‘ఈ ఏడాది జాక్‌ గొప్పగా ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నేను స్వప్పించిన టైటిళ్లలో మాస్టర్స్‌ 1000 ఒకటి. మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించటం గొప్ప అనుభూతిగా ఉంది’ అని కాస్పర్‌ రూడ్‌ విజయానంతరం వ్యాఖ్యానించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -