ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. ఈ సినిమా ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ‘గిరిగిర, సల్లంగుండాలే’ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.
తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 16న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వీడియోలో రోషన్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన అల్బమ్ కంపోజ్ చేశారు. తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రీక్రియేట్ చేశారు. ఆర్.మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘ఛాంపియన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



