Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి

విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి

- Advertisement -

న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎమ్. డేవిడ్ కుమార్ 
నవతెలంగాణ – నకిరేకల్ 

భారత విప్ల ఉద్యమానికి చంద్రపుల్లారెడ్డి దిశా దశను నిర్దేశించిన విప్లవ చుక్కాని అని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ జరిగింది. అంతకుముందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవోద్యమంలో అసమర్థం లేని సమాజం కోసం రివిజనిజానికి, నయా రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ సిద్ధాంతకర్త పుల్లారెడ్డి అని కొనియాడారు. నేడు దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాన్ని అనుసరిస్తూ ఫాసిస్ట్ పాలనను వేగవంతం చేస్తుందన్నారు.

దేశ సంపదను అదాని, అంబానీ లకు కట్టబేడుతుందని, అడవి సంపద ను కొల్లగొట్టడానికి ఆఫరేషన్ కాగార్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను హత్యలు చేస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు. రైతు పంటను కొనుగోలు చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందన్నారు. అమరవీరుల స్ఫూర్తి తో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై బలమైన విప్లవ పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, బొమ్మిడి నగేష్,కునుకుంట్ల సైదులు, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు గజ్జి రవి. పి. వై. ఎల్ జిల్లా అధ్యక్షులు మామిడోజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి. వి చారి, ఐ ఎఫ్ టీ యూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటిశంకర్, మామిడి ఎల్లయ్య, అంబటి నర్సయ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, సిలువరు జానయ్య, వేముల శంకర్, రావుల లింగయ్య,పి. ఓ. డబ్ల్యూ నాయకులు గజ్జి లక్ష్మి, పి.డి.ఎస్.యూ నాయకులు లోకేష్, బొంగరాల నర్సింహా, చెరుకు సైదులు, కుంభం వెంకటేశ్వర్లు, అంబటి వెంకన్న,ప్రభాకర్, చైతన్య, యశోద, పార్వతమ్మ, లలిత పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -