హీరో చంద్రహాస్ మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. లేటెస్ట్‌గా ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
హీరో సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడం లేదు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అర్థమవుతోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని వేరే చెప్పక్కర్లేదు.
జైరామ్ చిటికెల ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని పివికె ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
దేశభక్తి నేపథ్యంలో చంద్రహాస్ కొత్త సినిమా
- Advertisement -
- Advertisement -