హీరో రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్‌లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా హీరోయిన్‌ను పరిచయం చేశారు. బ్లాక్‌బస్టర్ ‘సీతారామం’తో మణాల్ ఠాకూర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన స్వప్న సినిమాస్ సంస్థ ఈ సినిమాతో మలయాళ నటి అనస్వర రాజన్‌ను పరిచయం చేస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో చంద్రకళగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కథలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర అని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి డిఓపి: ఆర్ మాధీ, సంగీతం: మిక్కీ జె మేయర్, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, దర్శకత్వం : ప్రదీప్ అద్వైతం.
‘ఛాంపియన్’లో చంద్రకళగా..
- Advertisement -
- Advertisement -