హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’తో అలరించబోతున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్‌తో సంచలనం సష్టించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. టీజర్ ప్రేక్షకులకు మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్‌ని పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో అనస్వర రాజన్ పోషించిన చంద్రకళని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
గ్లింప్స్‌లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు.
తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే పెద్ద కలలు కంటూ, మంచి నాటక కళాకారిణిగా ఎదిగి, ఒక రోజు తనకంటూ స్వంత నాటక బందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకు సాగే అమ్మాయి చంద్రకళ. అనస్వర రాజన్ పాత్రను ఎంతో అందంగా మలిచారు. ఆమె పాత్ర ఎంత కీలకమో సన్నివేశాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రోషన్-అనస్వరల కెమిస్ట్రీ ఈ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రేమకథ మనసుని తాకేలా ఉండబోతుంది. మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ఆహ్లాదకరమైన మెలోడీ కట్టిపడేసింది. రామ్ మిరియాల వాయిస్ మెస్మరైజింగ్‌గా ఉంది. పూర్తి లిరికల్ సాంగ్ ఈనెల 25న విడుదల కానుంది అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
‘ఛాంపియన్’లో చంద్రకళగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



