- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి
మండల ఊప సర్పంచుల సంఘం అధ్యక్షునిగా చంద్ర శేఖర్ రేకులపల్లి,ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ దమ్మన్నపేట, క్యాషియర్ దీప శ్రీకాంత్ కొట్టాలపల్లి, జనరల్ సెక్రెట్రి గోవింద్ ఇంద్రనగర్ తండా,కార్యదర్శి సునీత మొతిలాల్ ఎస్బి తండా, గార్లు ఏకగ్రీవంగా ఎన్నులున్నారు. అంతకుముందు కాంగ్రేస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ నూతన ఉప సర్పంచులకు ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యక్రమములో నూతనంగా మండల కార్యవర్గంలో ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ ఉప సర్పంచుల సమస్యల సాధనకు తమవంతు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమములో కాంగ్రేస్ పార్టీకి చెందిన ఆయా గ్రామాల ఉప సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



