- Advertisement -
వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్
బ్యాంకాక్ (థాయ్ లాండ్) : వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో చంద్రిక పుజారి పసిడి పంచ్ విసిరింది. మహిళల 51 కేజీల విభాగంలో ఉబ్బెకిస్తాన్ బాక్సర్‌పై 5-0తో ఏకపక్ష విజయం సాధించిన చంద్రిక గోల్డ్ మెడల్ సాధించింది. మరో ముగ్గురు బాక్సర్లు సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నారు. గుంజన్ (48 కేజీలు), జోశ్రీ దేవి (54 కేజీలు) సహా మెన్స్ విభాగంలో అంబేకర్ (50 కేజీలు) పసిడి పోరులో తలొగ్గి రజతంతో సరిపెట్టుకున్నారు.
- Advertisement -



