Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా 

చండూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా 

- Advertisement -

చైర్మన్ అభ్యర్థి డా. కోడి శ్రీనివాసులు 
నవతెలంగాణ – చండూర్

చండూర్ మున్సిపల్  పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ, ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని ఆరో వార్డ్  చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆరో వార్డు సభ్యులకు తన నమ్మకం పై గెలిపించినందుకు తనను విశ్వసించి ఓటు వేసిన వారికే కాకుండా, ఓటు వేయని వారికీ కూడా కృతజ్ఞతలు అని తెలిపారు. 6వ వార్డు అభివృద్దే నా లక్ష్యం. ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో, మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఎన్నికల  ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -