Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమార్పు మొదలైంది.. ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న అడ్మిషన్స్

మార్పు మొదలైంది.. ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న అడ్మిషన్స్

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : ఒకరు స్ఫూర్తి అయితే మరొకరు కృషిచేసి ఏకంగా 45 మంది విద్యార్థులను అడ్మిషన్ చేయించడం మండల విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే దోస్త్ పల్లిలో ఏకోపాధ్యాయుని కృషి వలన 30 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ అయిన విషయం తెలిసిందే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని బస్వాపూర్ గ్రామం ఎంపియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా 45 మంది విద్యార్థులను నూతన అడ్మిషన్ చేయించారు. ప్రస్తుతం పాఠశాల హెచ్ఎంగా ఉన్న జై చంద్ గతంలో మండలంలోని కేమ్రాజ్ కల్లాలి ఎంపియుపిఎస్ పాఠశాలకు హెచ్ఎంగా వ్యవహరించారు.

అక్కడ కూడా ఇదే స్ఫూర్తితో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం తనకున్న మంచి అలవాటు. గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారంతో మంచి గుర్తింపు పొందారు. బస్వాపూర్ గ్రామస్తులు సహకారం బాగుంది. వారిసహకరించడంతోనే 45 మందిని ఒకేసారి అడ్మిషన్ చేయించగలిగారు. ప్రయివేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనె చందంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు వచ్చింది. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్ళించడం ప్రధానోపాధ్యాయంతో పాటు తోటి ఉపాధ్యాయ బృందం ఎంతగానో కృషి,  సహకారం లభించినప్పుడే విజయాలు సాధించ గలుగుతా మని ఇదే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మార్పు ఇటీవలే మొదలైంది. ఇది ఇలాగే ఇకముందు కూడా కొనసాగాలని ఆశిద్దాం..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad