- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ మెటిక్స్-2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను అదే నెల 4న నిర్వ హించనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 3న హౌళీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
- Advertisement -



