Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకులాల సమయాన్ని మార్చండి

గురుకులాల సమయాన్ని మార్చండి

- Advertisement -

– ఎస్సీ, బీసీ గురుకులాల కార్యదర్శులకు ఎమ్మెల్సీ కొమరయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని గురుకులాల సమయపాలనను మార్చాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఎస్సీ, బీసీ గురుకులాల కార్యదర్శులు అలుగు వర్షిణీ, సైదులును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లోని టైంటేబుల్‌ను పున:సమీక్షించాలని కోరారు. కొత్త టైంటేబుల్‌ను అమలు చేయాలని సూచించారు. ఈ అంశం గురించి గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అన్ని గురుకులాల కార్యదర్శుల పరిశీలనకు పంపిస్తామన్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో కామన్‌ స్టాఫ్‌ ప్యాట్రన్‌ను అమలు చేయాలని సూచించారు. కామన్‌ పదోన్నతులు కల్పించేలా చూడాలని కోరారు. అలుగు వర్షిణీ, సైదులు దీనిపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -