– ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026 సంవత్సరంలో పాలనాపరమైన సంస్కరణలు, నైపుణ్యాధారిత ఉన్నత విద్యా కోర్సులను తీసుకురానున్నట్టు తెలిపారు. అకడమిక్ ఆడిట్‌ను వేగవంతం చేస్తామనీ, దోస్త్ ద్వారా సకాలంలో సీట్లను భర్తీ చేస్తామనీ, అన్ని కోర్సుల్లోనూ వేగంగా కౌన్సిలింగ్ చేపడుతామనీ, ఇంజినీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో చేస్తామని వెల్లడించారు. మండలి వెబ్‌సైట్‌ను మరింత సరళీకరించి ఉన్నత విద్య సమాచారాన్ని విద్యార్థులు సులభంగా పొందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దోస్త్‌లో గతంలో మాదిరిగా సీట్లు మిగిలిపోకుండా కోర్సులు, సీట్ల హేతుబద్ధీకరణ ప్రధాన ఎజెండాగా తీసుకుంటామని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
డిగ్రీ సిలబస్ లో మార్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



