Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ ప‌నివేళ‌ల్లో మార్పులు

ఢిల్లీ ప‌నివేళ‌ల్లో మార్పులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం ఢిల్లీని వ‌ణికిస్తున్నాయి. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. నవంబర్ 15 నుండి ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

సవరించిన పనివేళల మార్పులు 2026, ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటాయని సీఎం రేఖా గుప్తా తెలిపారు. శీతాకాల సమంలో ట్రాఫిక్ ఒకేసారి పెరగకుండా ఉండేదుకు, కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశ్యమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -