ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల్లో జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువ అవుతోందనీ, దానికి అనుగుణంగా వైద్యవ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై శనివారంనాడాయన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదరుకుమార్, టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ ఎమ్‌డీ ఫణీంద్రరెడ్డి, టీవీవీసీ కమిషనర్ అజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లసంఖ్య 12వేలకు పైగా ఉందనీ, సమీప భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవనశైలి మారడంతో దీర్ఘకాల వ్యాధులు పెరుగుతున్నాయనీ, దానికి తగినట్టు వైద్య వ్యవస్థ ఉండాలని చెప్పారు. అవసరమైన చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
వైద్యవ్యవస్థలో మార్పులు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



