నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని కొండనాగుల గ్రామానికి చెందిన కామన్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెంచులకు దుప్పట్లు మరియు పోషకాహార కిట్టులను అందజేశారు. సంస్థ ప్రతినిధి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాదులో నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ తన తండ్రి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా సంస్థ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం అప్పాపూర్ గ్రామాలకు చెందిన చెంచులకు దుప్పట్లు మరియు పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించిన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
అక్కడ నివసించె 80 కుటుంబాలకి రూ.20 వేల విలువైన బ్లాంకెట్స్ మరియు పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్స్ అందించారు. గ్రామం లో ప్రజలు ఈ సారి వచ్చినప్పుడు చెప్పులు తీసుకురావాలని అడగడం జరిగిందని తెలిపారు. మరోసారి తప్పకుండా మీ కనీస అవసరాలను తీర్చేందుకు సంస్థ తరఫున కృషి చేస్తామని తెలిపారు. తమవంతుగా తోచిన చెయ్యాలని ప్రతిఒక్కరు బాధ్యత గా ఇలాంటివారికి తోచినంత మేలు చెయ్యాలని కోరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త శ్రీ పులిరాజు గారు సాయిశ్రీనివాస్ గారిని కామన్ మ్యాన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిదులని అభినందించారు.
యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు, కామన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధి బాలక్రిష్ణ అడిగిన వెంటనే కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి వెహకిల్ ఏర్పాటు చేసి అటవీ శాఖ అధికారి శ్రీ వీరేశం గారికి రోజంతా మాతో ఉండి సహకారం అందించిన బీట్ ఆఫీసర్స్ రమేష్ గారికి, ప్రవీణ్ గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రంలో కామన్ మ్యాన్ ప్రతినిధులు సాయి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త శ్రీ పులిరాజు అటవీ శాఖ అధికారులు రమేష్, ప్రవీణ్ గారు, బాలక్రిష్ణ, శేఖర్, వంశీ, భరత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.