మండల ప్రత్యేక అధికారి మధుసూదన్
నవతెలంగాణ – మిరుదొడ్డి
కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రత్యేక అధికారి గణేష్ రామ్ , తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో గణేష్ రెడ్డి లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిరుదొడ్డి మండలంలో నిర్వహిస్తున్న ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా గ్రామాల్లో నిర్వహించిన కొనుగోలు కేంద్రాలను సద్యం చేసుకోవాలని వారు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన తమకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం లక్ష్మీనరసమ్మ, ఆర్ఐ రాజకుమార్, సీసీలు వరలక్ష్మి జ్యోతి వైకుంఠం ప్రభాకర్ తో పాటు వివోఏలు బుజ్జమ్మ , మానస, మహేష్, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


