Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్ఉలిక్కిపడ్డ చార్మినార్..17 మంది మృతి

ఉలిక్కిపడ్డ చార్మినార్..17 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా పెరల్స్, మోడీ పెరల్స్ షాపులతో పాటు ఇళ్లకూ మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏసీ కారణంగా మంటలు చెలరేగగా స్పాట్ లోనే ముగ్గురు మరణించారు. ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు. మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఊపిరాడక అపోలో ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో మరో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad