Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐటిఐ కాలేజీలో చేగువేరా 58వ వర్ధంతి 

ఐటిఐ కాలేజీలో చేగువేరా 58వ వర్ధంతి 

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు  దామర కిరణ్..
నవతెలంగాణ – కాటారం

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాటారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ విప్లవకారుడు విప్లవ వేగు చుక్క చేగువేరా గారి 58 వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. అనంతరం SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ… పోరాటాల పురిటి బిడ్డ. సాహసానికి మారు పేరు. డాక్టర్‌. రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు. సైనిక వ్యూహకర్త. పాలనాదక్షుడు. దౌత్యవేత్త. గెరిల్లా యోధుడు. యుద్ధ సిద్ధాంతకర్త. అన్నింటికీ మించి మానవతావాది. నేటి తరానికి స్ఫూర్తి. మార్గదర్శి చేగువేరా అని అన్నారు.

చే గువేరా సామ్రాజ్యవాదుల, దాని తొత్తుల చేతిలో హత్యగావించబడే నాటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. ఆయన జీవితాన్ని చదువుతుంటే వాయువేగంతో అనేక జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా సినిమా రీల్‌లాగా మారిపోతున్నట్లే అనిపిస్తుంది. చే పేరు చెబితేనే కళ్లముందు ఆయన రూపం కనిపిస్తుంది. ఆకుపచ్చ సైనిక దుస్తులు, తలపై మిలటరీ క్యాప్‌, దానిపై ఐదు కోణాల నక్షత్రం, సన్నని గడ్డం- మీసాలు, తేజోవంతమైన ముఖం.ఒకసారి హవానా చుట్టతో, మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనబడే చేగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది.

విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి, ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ వర్గ దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయాలని జీవించినంత కాలం పరితపించేవారు చే. అంతర్జాతీయ శ్రామికవర్గ పోరాటాలకు ఊపిరులూదిన చే ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు. బొలీవియా సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడుతూ శత్రుసేనలకు చిక్కి హతమయ్యారు. ప్రజల గుండెల్లో చిర స్థాయి గా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -