Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామ్రాజ్యవాదంపై చేగువేరా అలుపెరుగని పోరాటం 

సామ్రాజ్యవాదంపై చేగువేరా అలుపెరుగని పోరాటం 

- Advertisement -

చేగువేరా నేటి యువతకు స్ఫూర్తిదాయకం 
నవతెలంగాణ – దుబ్బాక 
: అమెరికన్ సామ్రాజ్యవాదంపై అలుపెరుగని పోరాటం చేసిన ప్రపంచ విప్లవకారుడు, గొప్ప యోధుడు చేగువేరా అని, ఆయన విప్లవ పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సింగిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ప్రపంచ విప్లవ కెరటం, విప్లవాల వేగుచుక్క, పోరాట యోధుడు, కామ్రేడ్ చేగువేరా 97 వ జయంతి సందర్భంగా శనివారం దుబ్బాక మండలం రఘోత్తంపల్లి లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. కుల మత, పేద ధనిక వంటి అంతరాలు లేని సమాజం, సమానత్వం, సామాజిక న్యాయం సాధించినప్పుడే చేగువేరా కు మనమిచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -