ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హయంలో అశాస్ట్రీయ పద్ధతుల్లో మంథని నియోజకవర్గంలో నిర్మాణాలు చేపట్టిన చెక్ డ్యామ్స్, బ్రిడ్జిలు సుడిగాలి, తేలికపాటి వరద బీభత్సవాలకే ముక్కలై కులుతున్నాయని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్ ఆరోపించారు. గురువారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,చిన్నతూoడ్ల సర్పంచ్ గడ్డం క్రాoతి,కాంగ్రెస్ నాయకుడు ఐత రాజిరెడ్డి,సిగ్గెం రాజేష్ లు కూలిన పివినగర్-సోమన్ పల్లి సరిహద్దుల్లో ముక్కలైన చెక్ డ్యామ్ ను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చెసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానేరులో రూ.38 కోట్ల 82లక్షలతో ఆశాస్ట్రీయంగా నిర్మించిన చెక్ డ్యామ్ బుధవారం ముక్కలై కూలిందన్నారు.కొన్ని నెలల క్రితం తాడిచెర్ల-ఖమ్మంపల్లి వద్ద నిర్మాణం చెపట్టిన చెక్ డ్యామ్,ఓడెడ్ వద్ద నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జి గ్యాడర్లు కూలినట్లు తెలిపారు. ఇవన్నీ నాణ్యత లోపంతోనే కూలిపోవడం జరిగిందని తెలిపారు. దీనిపై సంభదిత డిఇని అడిగితే ఎవరైనా బాంబులు పెట్టి పేల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ హయాంలో నాణ్యత లోపంతో నిర్మాణాలు చేపట్టిన చెక్ డ్యామ్స్,బ్రడ్జీలు ఇలా అవడానికి కారణం అప్పటి పాలకులు,ఇరిగేషన్ అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల ప్రజా సొమ్ముకు కక్కుర్తి పడి,పందికొక్కుల్లా దోచుకోవడమే ఘాటుగా విమర్శించారు.అదే కాంగ్రెస్ హయాంలో అడవి సోమన్ పల్లి-పివినగర్ వద్ద 1972లో నిర్మాణం చెసిన బ్రిడ్జి చెక్కు చెదరలేదన్నారు.ప్రజాసొమ్మును దుర్వినియోగానికి పాల్పడి దోచుకున్న అప్పటి పాలకులైన,అధికారులైన,గుత్తేదారులైన విచారణ చేపట్టి వారిపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుoధని హెచ్చరించారు.



