నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని శ్రీగిరి క్షేత్రం జంబి హనుమాన్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో ప్రతిష్టాపన కోసం తీసుకువచ్చే వినాయక విగ్రహాల నమోదు కోసం ఈ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు కమ్మర్ పల్లి ఏఎస్ఐ నరేందర్ తెలిపారు. జగిత్యాల జిల్లా వైపు నుండి నిజామాబాద్ జిల్లాలోకి తీసుకువచ్చే విగ్రహాల వివరాలను చెక్ పోస్ట్ లో ఏర్పాటు చేసిన రిజిస్టర్ లో నమోదు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ గ్రామానికి తీసుకెళ్తున్నారు, ఏ వాహనంలో విగ్రహాన్ని తెస్తున్నారు, వినాయక మండప నిర్వాహకుల వివరాలు, వారి కాంట్రాక్ట్ నెంబర్లతో కూడిన సమగ్ర సమాచారాన్ని చెక్ పోస్ట్ లో రిజిస్టర్ లో నమోదు చేసుకుంటున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను యువకులు శాంతియుత వాతావరణం లో, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా కులమతాలకతీతంగా పండుగను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో కానిస్టేబులు లింబాద్రి, మోహన్ నాయక్, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
వినాయక విగ్రహాల నమోదు కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES