– ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
– అందుబాటులోకి ముఖ హాజరు విధానం
నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఇష్టానుసారంగా డుమ్మాలు కొట్టేందుకు వీలు లేకుండా పోయింది.కాలేజీల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు ముఖ హాజరు (ఎప్ఆర్ఎస్)విధానానికి శ్రీకారం చుట్టింది.సాధారణంగా చాలామంది విద్యార్థులు ఉదయం వచ్చి మధ్యాహ్నం డుమ్మా కొట్టడం, మరి కొందరు కళాశాలకు వెళ్తున్నామని చెప్పి కాలేజీకి రాకుండా గైర్హాజరు కావడంలాంటివి చోటు చేసుకుంటుడటంతో హాజరు శాతం తగ్గిపోయి విద్యార్థులే నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థుల డుమ్మాలపై దృష్టి సారించి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది.ఆగస్టు 23 నుంచే మొదలైన ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోఎస్ఆర్ఎస్(ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్)కు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది.సీజీజీ(సెంటర్ బోర్డు ఫర్ గుడ్ గవ ర్నెన్స్) సాంకేతిక సహకారంతో ఇంటర్ బోర్డు అధికారులు ఎస్ఆర్ఎస్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.
గతంలో రిజిస్టర్ విధానం ద్వారా హాజరు తీసుకునేవారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త విధానం ద్వారా ఉదయం, మధ్యాహ్నాం రెండుసార్లు అధ్యాపకులు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఏ కారణంతోనైనా పాఠశాలకు డుమ్మాకొడితే ఆ సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు అధికారులకు సైతం వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు కళాశాలలకు డుమ్మా కొట్టే సమాచారం తల్లిదండ్రులు, అధికారులకు తెలియనుండటం వల్ల డుమ్మాలకు స్వస్తి పలికే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు పెరడంతోపాటు విద్యాపరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.