మూసేసిన ఆస్పత్రుల పేర్లతో సర్టిఫికెట్లు
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి
510 ఆస్పత్రుల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు రద్దు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎవరికైనా ఆధార్‌కార్డుతోపాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కీలకం. సాధారణంగా పాప, బాబు పుట్టగానే బర్త్ సర్టిఫికెట్ (జనన ధ్రువీకరణపత్రం) తీసుకుంటారు. డెలివరీ అయిన ఆస్పత్రి నుంచి డైరెక్ట్‌గా కార్పొరేషన్ ఆఫీస్‌కు పుట్టిన శిశువు వివరాలు వెళతాయి. ఎవరైనా మరణిస్తే ఆ పూర్తి వివరాలను సైతం నమోదు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో దాదాపు 4లక్షల జననాలు జరుగుతుంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో నివాసముంటున్న వారితోపాటు ఇతర జిల్లాల నుంచి డెలివరీల కోసం హైదరాబాద్‌కు గర్భిణీలు వస్తుంటారు. ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయం అందుతుందన్న నమ్మకంతో వీరిలో కొందరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతుం టే, మరికొందరు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతుంటారు. అయితే నగరంలో మూతపడిన ఆస్పత్రుల నుంచి కూడా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతుం డటం సంచలనం రేపుతోంది. దీనిపై అధి కారులు దృష్టి సారించారు. అడ్డదారులు తొక్కు తున్న వారికి చెక్‌పెట్టేందుకు సిద్ధమయ్యారు.
అడ్డదారుల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అడ్డదారుల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీచేయడం ఒక ఎత్తయితే, కొందరు దళారులు మూతపడిన ఆస్పత్రుల పేర్లతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి పెద్దఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకుండానే నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని టోలీచౌకిలోని మెట్రో ఆస్పత్రిని కొన్నాళ్ల క్రితమే మూసేశారు. కాగా, ఆ ఆస్పత్రి నుంచి అధికంగా జనన, మరణాలను ధ్రువీకరిస్తూ ఈ సేవా ద్వారా బల్దియాకు వివరాలు వస్తున్నా యి. టోలీచౌకిలోని మెట్రో ఆస్పత్రిల్లో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా 65 బర్త్, మరో 8 డెత్ సర్టిఫికెట్లు జీహెచ్‌ఎంసీ నుంచి పొందినట్టు అధికారులు గుర్తించారు. గత సంవత్సరం నగరంలో వివిధ ప్రాంతాల్లో 74 మంది శిశువులు ఇంట్లో జన్మించారని, ఇందుకు సంబం ధించి బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌లో అడుగడుగునా ఆస్పత్రులు న్నా ఇంకా హౌమ్‌బర్త్ ఏమిటీ అన్న అనుమానం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి రావడంతో ఆయన హొమ్‌బర్త్‌లకు జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లపై విచారణ చేయించారు. దాంతో 74 హౌమ్ బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి విచారణ జరిపారు. యూసుఫ్‌గూడ శిశువిహార్‌లోని అనాథ పిల్లలకు చెందిన 38 సర్టిఫికెట్లు హౌమ్ బర్త్ అంటూ జారీ చేయటం సక్రమమేనని తేలింది. మిగిలిన వాటిపై విచారణ ముమ్మరం చేయటంతో టోలీచౌకీలోని మెట్రో ఆస్పత్రి నుంచి (మూతపడింది) ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే.. ఆఫీసర్లను, సిబ్బందిని మేనేజ్ చేసుకుని 65 బర్త్, 8 డెత్ సర్టిఫికెట్లు అడ్డదారిలో పొందినట్టు విచారణలో తేలింది. దాంతో సంబంధిత అధికారులు, సిబ్బందిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు
బల్దియాలో ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దాదాపు 1823 ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆస్పత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. అలాంటి వాటిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 510 ఆస్పత్రులను మూసివేశారు. వాటి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ను రద్దు చేశారు. ఇక తప్పులు చేసిన ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సంబంధిత శాఖను కోరనున్నట్టు తెలిసింది. దాంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల జారీలో అంటకాగిన వారితోపాటు సంబంధిత డాక్టర్లు, ఆస్పత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీస్‌శాఖకు సిఫారసు చేసినట్టు తెలిసింది.
ఆస్పత్రుల అడ్డదారులకు చెక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES