Wednesday, April 30, 2025
Homeజిల్లాలుడాగ్ స్క్వాడ్ తో తనిఖీలు 

డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు 

నవతెలంగాణ -తాడ్వాయి : నార్కోటిక్ లో ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో మండల కేంద్రంలో అన్ని షాపులు, హోటల్ లు ఆర్టీసీ బస్టాండ్ ఏరియా మండల కేంద్రంలోని పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్శ్రీసై కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్స్ కార్డును తెప్పించామని, మాదకద్రవ్యాలను అరికట్టడానికి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ డాగ్స్ కు పత్తు పదార్థాల వాసన పసిగట్టి వాటిని సులభంగా గుర్తించే గుణం ఉంటుందని, ఈ కారణంగానే జాగిలాలను తనిఖీల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా చేసే వారితో పాటు, వినియోగించి వారిపై కూడా కేసులు నమోదు చేయునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img