Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిబుగ్గ గిల్లి…

బుగ్గ గిల్లి…

- Advertisement -

‘కమ్యూనిస్టు పార్టీలు ఉప్పులాంటివి. అవి లేకపోతే రాజకీయాల్లో రుచి ఉండదు. సమాజంలో జరిగే మంచినీ, చెడునూ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తమ పోరాటాల ద్వారా ప్రభుత్వానికి, పాలకులకు దిశా నిర్దేశం చేస్తుంటారు కమ్యూనిస్టు నాయకులు. అందుకే మా ప్రజా ప్రభుత్వం లెఫ్ట్‌ పార్టీల ఉద్యమాలు, పోరాటాలకు పూర్తి వెసులుబాటునిస్తుంది…’ అంటూ ఇటీవల హామీనిచ్చారు సీఎం రేవంత్‌. ఆయన చెప్పింది బాగానే ఉంది గానీ… ఇటీవల ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా, ఎలాంటి పోరాటాలు లేకపోయినా… కార్మిక, ప్రజా సంఘాల నాయకులను అదేపనిగా అరెస్టులు చేస్తున్నారు పోలీసు బాబాయిలు. అంతే కాదండోరు.. కాలు బయటపెట్టనీయకుండా గృహ నిర్బంధాలూ చేస్తున్నారు. సరేలే, పోనీ… జిల్లాల్లో జరిగే అన్ని సంఘటనలతో సీఎంకు ఏం సంబంధం ఉంటుంది.. అక్కడి పోలీసు సార్లే హడావుడి చేస్తున్నారు, పాపం పెద్దసారు(సీఎం)కేం తెలుసని సరిపెట్టుకుందామంటే, ఆఖరికి హైదరాబాద్‌లో కూడా లెఫ్ట్‌ నేతలను రోడ్డెక్కకుండా హౌజ్‌ అరెస్టులు చేస్తున్నరాయే. బహుశా… బుగ్గగిల్లి, జోలపాట పాడటమంటే ఇదేనేమో. ఇదే అధికార కాంగ్రెస్‌ అసలు విధానమా? లేక అనధికారిక నిర్ణయాలా..? మున్ముందుగానీ దీనిపై మరింత క్లారిటీ రాదంటున్నారు రాజకీయ పండితులు…
-కె.నరహరి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad