మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు విజయ్
నవతెలంగాణ – ఊరుకొండ
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ.. దేశ అభ్యున్నతైనా, రాష్ట్ర అభివృద్ధయినా జనాభా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుందనీ అందుకే జనాభాను వాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం తొలి అడుగు వేసిందనీ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనపై మేలైన చట్ట సవరణ ద్వారా ప్రజల మనోభావాలను అర్థం చేస్తుందని యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పుకు శ్రీకారం చుట్టడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు అభినందనలు తెలియజేస్తున్నాయని తెలిపారు.
ఇద్దరు పిల్లలు అంతకన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిబంధనను ఎత్తివేయడం అభినందనీయమని అన్నారు. క్యాబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర పాలకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా, ఈ చట్ట సవరణ స్థానిక సంస్థల రాజకీయాలపై ప్రభావం చూపుతుందనీ విజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్నవాళ్లూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం వల్ల ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణా జరుగుతుందని పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై హర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES