నవతెలంగాణ – దర్పల్లి
77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శాంత జెండా ఎగురావేశారు. ఎంపిడిఓ లక్ష్మరెడ్డి, అలాగే మండలంలో అన్ని గ్రామాల్లో, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఆయా కార్యాలయాల అధికారులు, ఆయా గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచులు, సీఐ కార్యాలయంలో సీఐ భిక్షపతి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సామ శ్రీనివాస్ తమ తమ కార్యాలయాల్లో జెండాను ఎగురావేశారు. ఈసందర్బంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమములో ఉత్తమ బిఎల్ఓగా చెలిమేల రాములుకు అవార్డులు మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ప్రధానం చేశారు. కార్యక్రమములో తహసీల్దార్, ఎంపిడిఓ, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ సొసైటీ చేర్మెన్ చెలిమేల శ్రీనివాస్, డిటి ప్రవీణ్ కుమార్, ఆర్ఐ రాజేశ్వర్, అయ్యాగ్రామాల జిపిఓలు, కార్యాలయ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు.
ఉత్తమ బిఎల్ఓగా చెలిమేల రాములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



