- Advertisement -
గోవాపై ఉత్కంఠ విజయం
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్లో చెన్నై బ్లిట్జ్ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గోవా గార్డియన్స్‌పై చెన్నై బ్లిట్జ్ ఐదు సెట్ల థ్రిల్లర్‌లో 3-2 (12-15, 15-11, 10-15, 18-16, 15-13)తో పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు జెరోమి వినిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. పీవీఎల్ లీగ్ దశలో నేడు హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, ఢిల్లీ తూఫాన్స్ మ్యాచ్ జరుగనుంది.
- Advertisement -