- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో ముగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌పై 83 పరుగుల తేడాతో విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్ జట్టు.. 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41) తప్ప.. మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో అర్షద్ ఖాన్ (20) ఫర్వాలేదనిపించాడు. నూర్ అహ్మద్, కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, పతిరణ చెరో వికెట్ తీశారు.
- Advertisement -