Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులుగా చెన్నయ్య

పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులుగా చెన్నయ్య

- Advertisement -

– ప్రధాన కార్యదర్శిగా బి. రత్నాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులుగా ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా బి.రత్నాకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులు వారిని ఎన్నుకున్నారు. పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్‌ రెడ్డి హర్షవర్ధన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను వెంటనే పునరుద్ధరించాలనీ, పీఆర్సీని తక్షణమే ప్రకటించి ఉపాధ్యాయ ఉద్యోగులకు అమలుపర్చాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలనీ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలనీ, 317 జీవో సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే స్కూల్‌ అసిస్టెంట్‌ జోనల్‌ పోస్టుగా ప్రకటించాలని ప్రతిపాదించారు. ఎస్‌జీటీలకు ప్రభుత్వం ప్రకటించిన పదివేల పోస్టులను వెంటనే మంజూరు చేయాలనీ, మిగిలిపోయిన భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌గా అప్‌ గ్రేడ్‌ చేయాలని సమావేశం తీర్మానించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad