Friday, July 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నుండి చెక్కు అందజేత 

గ్రీన్ హెల్త్ సర్వీసెస్ నుండి చెక్కు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
జిల్లా 1962 ప్రాజెక్ట్ లో పారవేట్  గా  విధులు నిర్వహించే జక్కిన రామకృష్ణ  గత మార్చి నెలలో  అనారోగ్య కారణాలు  మరణించగా బుధవారం స్టేట్ హెడ్ బి కిరణ్ కిషోర్ చెక్కును అందజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా కానీ ఏ అనారోగ్య కారణాలు వల్ల కానీ ఏ ఉద్యోగస్తుడైన ప్రాణాలు కోల్పోతే వారికి ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నుండి బాధిత కుటుంబాలకు  కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలను ఇస్తుందని అన్నారు. ఈ అమౌంట్ ను ఉద్యోగస్తుల నామినీకి అందజేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -