Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఛాతినొప్పి... నిర్లక్ష్యం తగదు

ఛాతినొప్పి… నిర్లక్ష్యం తగదు

- Advertisement -

అజేంద్ర శ్రీకాంత్.. ఎంబీబీఎస్, ఎండి, డిఆర్ఎన్ఎస్ కన్సల్టెంట్ ఇంటర్వెల్ కార్డియాలజిస్ట్ వైద్యులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నవయస్సులోనే గుండెపోటు వస్తున్న దృష్ట్యా ఛాతినొప్పి విషయంలో నిర్లక్ష్యం తగదని అజేంద్ర శ్రీకాంత్ ఎంబీబీఎస్, ఎండి, డిఆర్ఎన్ఎస్ కన్సల్టెంట్ ఇంటర్వెల్ కార్డియాలజిస్ట్ వైద్యులు అజేంద్ర శ్రీకాంత్ సూచించారు. గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా వైద్యం అందితే మరణానికి ఆమడదూరం వెళ్లవచ్చు అన్నారు. డాక్టర్స్ సందర్భంగా నవతెలంగాణతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయన్నారు. వీటిలో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ (గుండెపోటుకార్డియో మయోపతి) అనగా గుండె కండరాల వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. భారతదేశంలో గుండెపోటు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురయ్యేవారి వయస్సు తగ్గుతోంది. చిన్నవయస్సు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకొని పాటించాల్సిన అవసరం ఉంది. 

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి తిరిగా ప్రాణం పోసే ఆరుదైన అవకాశం అందరికి రాదు. అది మా డాక్టర్లకు మాత్రమే ఉన్న అదృష్టం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఎంతో ఆనందం ఉంది. వైద్య వృత్తి ఎంతో సంతృప్తిని ఇస్తోంది. నేడు డాక్టర్స్ డే ను పురస్కరించుకొని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad