- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని జన్నారం చికెన్ సెంటర్ అసోసియేషన్ నాయకులు సులువ జనార్ధన్ డిమాండ్ చేశారు. భారీ వాహనాల కోసం జన్నారంలో దీక్ష చేస్తున్న భూమాచారి, బద్రీ నాయక్ను కలిసి శుక్రవారం మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. అటవీ ఆంక్షలతో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చికెన్ సెంటర్ అసోసియేషన్ సభ్యులు లింగంపల్లి రాజు, షేక్ ఇమ్రాన్, నాగిశెట్టి రవి, యండి రఫిక్, నగరు మహేందర్, ఎస్ డి ముజాఫర్, శివాని విక్రమ్ ఎంపిటిసి, వాసాల నరేష్ , ఎనగందుల సన్ని, యండి ఫెరోజ్ , షేక్ తాజ్ బాబ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -