- Advertisement -
అర్క వేణుగోపాలరావు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి (రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అర్క వేణుగోపాలరావు కుటుంబం సందర్శించుకున్నారు. ఆలయ పూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా , ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ వారికి శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపకతో పాటు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, మాజీ చైర్మన్ శ్రీ కైలాస్ రాజేశ్వరరావు, అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -



