Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు భవన నిర్మాణాలను పరిశీలించిన సీజే

హైకోర్టు భవన నిర్మాణాలను పరిశీలించిన సీజే

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ప్రతిష్టాత్మకంగా హైకోర్టు భవన నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో దాంతోపాటు అక్కడ న్యాయమూర్తుల కోసం ఏర్పాటు చేస్తున్న నివాస సముదాయాలను ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్‌ కుమార్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ ఆయన వెంట ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జోన్‌-1లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌స్టిట్యూషనల్‌ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా జోన్‌-2లో సుమారు 60 ఎకరాల భూమిని అన్ని సౌకర్యాలతో కూడిన నివాస విల్లాల నిర్మాణానికి కేటాయించారు. వాటికి ఏప్రిల్‌ 5న భూమిపూజ నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -