Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదగిరిగుట్ట సన్నిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

యాదగిరిగుట్ట సన్నిధిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం తెలంగాణచీఫ్ జస్టిస్ తెలంగాణ హై కోర్ట్ అపరేష్ కుమార్ సింగ్ గవారు దర్శించుకున్నారు. వారితో పాటు హై కోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ ‘ జస్టిస్ కె శరత్, జస్టిస్ కె సుజన, జస్టిస్ వి రామకృష్ణా రెడ్డి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యనిర్వాహణాధికారి జి.రవి, ఐఏఎస్ ఆధ్వర్యములో శ్రీ స్వామి వారి దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరము శ్రీ స్వామి వారి ప్రసాదము, ఫోటోలను ఈఓ వారికి అందజేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాచకొండ సీపీ సుధీర్ బాబు,ఆర్డీఓ కృష్ణ రెడ్డి, అదనపు కలెక్టర్ వీర రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -