- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన దివంగత మాజీ సీఎం శిబూ సోరెన్ ఏకాదశ దినకర్మకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా జార్ఖండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం అక్కడ సంతాప సభలో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, ఈ నెల 4న జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఈ నెల 4న ఉదయం 8.56 నిమిషాలకు శిబూ సోరెన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
- Advertisement -