Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -