Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం23న మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

23న మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- Advertisement -

అభివృద్ధి డిజైన్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 23న మేడారంలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించటం ద్వారా అక్కడి అభివృద్ధి పనులపై సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి, వారితో ఆయన సమాలోచనలు చేస్తారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మేడారం అభివృద్ధి ప్రణాళికపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మేడారం పర్యటన సందర్భంగా అక్కడి పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై పలు డిజైన్లను విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. జాతర పనులకు సంబంధించి టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని సూచించారు. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూ.చా.తప్పకుండా గౌరవించాలని ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 23న సీఎంతో పాటు పలువురు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంబంధిత అధికారులు మేడారం బయల్దేరి వెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -