- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం వికారాబాద్‌కు రానున్నారు. హరిత రిసార్ట్స్‌లో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ శిబిరంలో చర్చలు జరగనున్నాయి.
- Advertisement -



