Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి

- Advertisement -

డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కోసమే…

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి రేవంత్‌ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది పరిశీలకులను నియమించింది.

ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏఐసీసీ సీనియర్‌ నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమించింది. ఈ నెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు. ఆయా పదవుల కోసం జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -