నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ముదేల్లి గ్రామములో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ముద్దేళ్లి గ్రామనికి చెందిన సాబీరా బేగంకు ఇంటికెళ్లి 44,000 వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా బాదితురాలు మాట్లాడుతు గతంలో లాగ జిల్లాల మండలాల చుట్టూ తిరగకుండా మా ఇంటికే కార్యకర్తల ద్వారా చెక్కును పంపించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రోల సాయిలు, మాజీ సర్పంచ్ కాగుల మోహన్ యాదవ్, పెద్దకాపు సాయిలు, గులాం అలీ, Dr చందు, వడ్నాల లక్ష్మణ్, వినోద్, పల్లెకాశీరం, బంధుసాబ్, బాల్గురి రాజు, చాకలి బాలయ్య, ఒడ్డె వెంకటి, కుమ్మరి నారాయణ, సాయిలు, రాము యాదవ్, తదితరులు పాల్గున్నారు.
ముఖ్యమంత్రి సహాయ నీకు చెక్కు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES