– సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి పేదల వైద్యానికి భరోసాగా నిలుస్తుందని సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన గోపాల్ సాయన్న, భరత్ లాల్ లకు రూ.20వేల చొప్పున, శేరాల శాంతకు రూ.14వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. అట్టి ఆర్థిక సహాయం చెక్కులను సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కుల మంజూరులో సహకారం అందించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పేదల వైద్యానికి భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



