Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి సహాయ నిధి.. నిరుపేదలకు పెన్నిధి

ముఖ్యమంత్రి సహాయ నిధి.. నిరుపేదలకు పెన్నిధి

- Advertisement -

– కాంగ్రెస్  మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్..
నవతెలంగాణ – రాయపోల్
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు పెన్నిధి, అనారోగ్యబారిన పడినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అపటి సుధాకర్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం గొల్లపల్లి, మంతూర్ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐలపురం స్వామి రూ.24 వేలు, ఐలపురం మహేష్ రూ.30 వేలు, మంతూర్ గ్రామానికి చెందిన జీడిపల్లి మంజుల రూ.50 వేలు విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు.

ముఖ్య మంత్రి సహాయ నిది అంటే పేద మధ్య తరగతి కుటుంబాల నిధి అని అనారోగ్యంతో భాదపడుతున్న పేద మధ్య తరుగుతుల వారికి ఆర్ధిక వేసులు బాటు అవుతుందని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం సహాయనిధి చెక్కుల విషయంలో అవినీతి పాల్పడిందని విమర్శించారు. మాది ప్రజా ప్రభుత్వమని దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో భాదితులకు తక్షణమే అందచేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పట్నం యాదగిరి,నాయకులు మహేష్ యాదవ్, తూర్పు స్వామి, సిద్ధొల్ల స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జీడిపల్లి జనార్దన్ రెడ్డి, ఈరమైన యాదగిరి, చందు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -