– అధికారులకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోఈ నెల 7 నుంచి 30 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై వెంటనే నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై శనివారం హైదరాబాద్‌లోని సచివా లయం నుంచి పోలీసులు, ఇతర అధికా రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ముఖ్యమంత్రి ఇటివల నిర్వహిం చిన సమీక్షలో సూచించిన విధంగా ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విమానాశ్రయం, హౌటళ్లు, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద గట్టి భద్రత కల్పించాలని కోరారు. పోటీదారుల కోసం సవివరమైన బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినరు కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై నివేదిక అందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES