Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'చికిరి.. చికిరి'

‘చికిరి.. చికిరి’

- Advertisement -

రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. వద్ధి సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పి స్తున్నాయి. శుక్రవారం మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘చికిరి..చికిరి’ని రిలీజ్‌ చేశారు. పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం వేడుక చేసుకుంటాడు. ఈ బ్యూటీఫుల్‌ ఫీలింగ్స్‌ని లిరిసిస్ట్‌ బాలాజీ తన సాహిత్యంలో ఎంతో అద్భుతంగా మలిచారు.

ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అద్భుతంగా ఉంది. ఫోక్‌ ఎనర్జీ, మోడర్న్‌ బీట్‌లతో కంపోజ్‌ చేసిన ఈ పాటకు మొహిత్‌ చౌహాన్‌ తన ఎనర్జిటిక్‌ వోకల్స్‌తో జీవం పోశారు. జాని మాస్టర్‌ కొరియోగ్రఫీతో పాట విజువల్స్‌తో బ్యూటీఫుల్‌గా తెరకెక్కింది. రామ్‌ చరణ్‌ రాకింగ్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అదరగొట్టారు. ఆయన హుక్‌ స్టెప్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక జాన్వీ కపూర్‌ చాలా అందంగా కనిపించింది. పాట ట్యూన్‌, లిరిక్స్‌, విజువల్స్‌, ఎనర్జీ అన్నీ కలిపి ఈ పాటను నెక్స్ట్‌ పాన్‌-ఇండియా వైరల్‌ సాంగ్‌గా నిలబెట్టాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది. రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -